భావ ప్రకృతి - విశ్లేషణ
Bhava Prakruthi - Visleshana
ప్రపంచమంతా కాలుష్యంతో నిండిపోయింది. మనం అభివృద్ధి పేరుతో ఈ ప్రకృతిని పాడు చేస్తున్నాం. కానీ మనం మానసిక సంఘర్షణకు లోనైనప్పుడు ఆ ప్రకృతితోనే శాంతి, స్వేచ్ఛ, ఆనందం పొందుతున్నాం. ప్రకృతి భగవంతుడి విరాట్ స్వరూపంలా కనిపిస్తుంది. ఆనందంలోనూ, దుఃఖంలో కూడా ప్రకృతే మనకు ఆలంబనగా ఉంటుంది. విశ్వవ్యాప్తంగా కవులు ప్రకృతిని వర్ణించడం వీడలేదు. బ్రిటీష్ వారికి వేసవి గొప్ప ఆకర్షణగా ఎందుకు ఉంది? పాశ్చాత్య కవులలో షేక్స్పియర్ ఒక మనిషి మనసులోని తుఫానును, బయటి వాతావరణంలోని తుఫానును ఎంతో అద్భుతంగా వర్ణించారు. ప్రకృతికి, మనిషికి మధ్య పోరాటం ఎందుకు జరుగుతోంది? భారతీయ సాహిత్యానికి, పాశ్చాత్య సాహిత్యానికి గల తేడా ఏమిటో వినండి.
Artwork : https://unsplash.com/photos/YBVrGT6TzMM