సినీ కర్ణాటకం
Cinee Carnatakam
ప్రతీ పాటకు శృతి, రాగం, లయలు ఎంతో ముఖ్యం. సాంప్రదాయ సంగీతంలో చాలా రాగాలున్నాయి. ప్రతి రాగానికి ఆరోహణ, అవరోహణ ఉంటాయి. ఆ ఆ స్వరస్థానాలని బట్టి ఆ రాగానికి అంతటి అందం, అవి పాడుతున్నప్పుడు అంతటి తియ్యదనం వస్తాయి. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నవారు తప్ప వాటిని అంత అందంగా పాడలేరు. ఉదాహరణకి ఆరభిలో ఉన్న పంచరత్నం అందరూ పాడలేరు కానీ అదే రాగంలో ఉన్న సినిమా పాటలు ఎప్పుడూ అందరూ రాగం తీస్తూనే ఉండొచ్చు. అలాంటి మనకు నచ్చిన సినీ గీతాలు, అవి ఏ రాగంలో ఉన్నాయో వాటి వివరాలు ఈ సినీ కర్ణాటకం లో తెలుసుకుందాం.
గాత్రం : పూర్వ ధనశ్రీ కోట గళం : కొండూరు తులసీదాస్, కిరణ్ కుమార్
Image : https://qph.cf2.quoracdn.net/main-qimg-0ed8be3c5dae6dbf655f2e92019d5196-lq