దాసరి నారాయణ రావు - ముఖాముఖీ
Dasari Narayana Rao – Mukhaamukhee
దాసరి నారాయణ రావు అనగానే వెంటనే గురొచ్చేది ఆయన నిండైన విగ్రహం. మన ఊహకి ఇంకొంచెం అవకాశం ఇస్తే ఆయనకి మేకప్ వేసి _"సీతారావయ్యగారా!..."_ అనిపిస్తుంది. కష్టాల్లోంచి పాఠాలను నేర్చుకోవడం, అపారమైన ప్రతిభ, తీవ్రంగా శ్రమించే గుణం, శ్రీ దాసరి నారాయణ రావుకు భారత దేశంలో (ప్రపంచంలో?) అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనతను తెచ్చిపెడితే, గంభీరమైన ఆలోచనలు, సామాజిక స్పృహ, ఇతరుల కష్టాలను తీర్చాలన్న తపన ఆయనను ఒక పత్రికా సంపాదకుడిగా, శ్రామికల నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఎదిగేట్టు చేశాయి. 2008లో డా. మృణాళిని తో పాల్గొన్న ముఖాముఖీలో, ఆయన 'స్టార్' లపైన, తెలుగు సినిమా నాణ్యత పైన, పత్రికల పైన, సీక్వెల్స్ పైన, తన ఆలోచనలను నిర్మొహమాటంగా, సూటిగా, కుండబద్దలు కొట్టినట్టు పంచుకున్నారు. అవి విన్న తరువాత ఆయన 'బాహుబలి' చూడగలిగుంటే బావుండనిపిస్తుంది. ఓ దిగ్గజ మనిషి పోయిన తర్వాత సహజంగా ఆ రంగంలో ఆ మనిషి వదిలిన ప్రభావం గురించి చెప్పుకుంటాం. ఈ ముఖాముఖీ వింటే దాసరి ఇంకా చేయలేక పోయిన పనులు ఏమిటో ఆయన ద్వారానే మనకు తెలుస్తుంది. ఆ ముఖాముఖీని ఇపుడు దాసుభాషితం యాప్ లో వినండి.
Dr. Mrunalini interviews star film director Sri Dasari Narayana Rao. This was recorded in 2008.