దువ్వూరి వెంకట రమణ శాస్త్రి - విశ్లేషణ
Duvvuri Venkata Ramanasastri - Visleshana
చిన్నయ సూరి గారి బాల వ్యాకరణానికి రామణీయమైన వ్యాఖ్య రాసిన దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారి గురించి మృణాళిని గారి విశ్లేషణలో తెలుసుకుందాం. విద్య వల్ల మానవ సంబంధాలలో వచ్చే మార్పులను, జీవితాన్ని సారవంతంగా ఎలా మలచుకోవాలో వీరి జీవితం మనకి తెలుపుతుంది. పల్లెకి, పట్టణానికి మధ్య తేడాని, పట్టన వాసుల జీవితాన్ని వారు వర్ణించారు. తన జీవిత చరిత్రలో వారి అనుభవాలే కాక కొన్ని పిట్టకథల్ని కూడా చెప్పారు. దువ్వూరి వారి వ్యాకరణ ప్రస్థానం ఎలా మొదలైంది, కట్టు శ్లోకాలంటే ఏంటి, వారి లోపాలతో పాటు వారిని అందరూ ఎందుకు అంతగా ప్రేమించారో వినండి.
Image : https://upload.wikimedia.org/wikipedia/te/0/06/Duvvuri_venkataramana_sastry.jpg