ఫ్రెంచ్ ప్రిసనర్
French Prisoner
Fenwik Geyi
మన చుట్టూ మనకు తెలియకుండానే కొన్ని సూక్ష్మ శరీరాలు ఉంటాయని ప్రతి దేశం, ప్రతి జాతి వారూ నమ్ముతారు. అయితే అందులో నిజం ఎంతో చెప్పలేం కానీ, మన కోసం పరితపించే హృదయ ఆక్రందన మనందరికీ వినిపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఒక సంపన్నురాలిని పెళ్లి చేసుకుని ఆమె ఆస్తి మొత్తానికి, ఆ ఊరికి అధికారి అవుతాడు బ్రామ్‌వెల్. ఆస్తిని పెంచుకునే క్రమంలో పెళ్ళాన్ని, పిల్లల్ని పట్టించుకోడు. ఇద్దరు మగ పిల్లల తరువాత హారియెట్ అనే ఒక ఆడపిల్లకి జన్మనిచ్చి కన్నుమూస్తుంది బ్రామ్‌వెల్ భార్య. హారియెట్ చిన్ననాటి నుంచి తమ ఎస్టేట్‌లోని సుశాన్ అనే పిల్లతో పాటు పెరుగుతుంది. హారియెట్ తన తండ్రితో బాటూ ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఆ ఎస్టేట్ కి తానే వారసురాలు అనుకుంటూ ఉంటుంది. ఆ రోజుల్లో ఫ్రెంచ్, బ్రిటన్‌దేశాలకు యుద్ధం జరుగుతుంటుంది. డచ్ దేశస్థుడైన జాన్‌ను ఫ్రెంచ్ వాడనుకుని ఖైదు చేస్తారు. జాన్ జైలునుంచి తప్పించుకుని హారియెట్ వాళ్లకు చిక్కుతాడు. మొదట అసహ్యించుకున్నా హారియెట్ జాన్ ను ఇష్టపడి అతని ద్వారా ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. హారియెట్ అసలు స్వరూపాన్ని గమనించి జాన్ పాపని తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే కొన్నేళ్ల తరవాత జాన్ మనవడు వచ్చి హారియెట్ ఎస్టేట్ లోనే ఎందుకు ఉండిపోతాడో, అతనికి వినిపించిన భగ్నప్రేమ తాలూకూ ఆక్రందనలు ఏమిటో,హారియెట్ ఆ అసలు స్వరూపం ఏమిటో ఈ విశ్లేషణలో వినండి.
...