జ్ఞాపకం
Gnaapakam
మనిషి శారీరక, మానసిక జీవితాన్ని ప్రభావితం చేసే జ్ఞాపకం గురించి విందాం. భూతకాలంలో జరిగిన కొన్ని విషయాలు మనకు ఆనందాన్ని, బాధని కలిగించవచ్చు. వీటినే మధురజ్ఞాపకాలు, గత స్మృతులుగా చెప్పుకుంటాము. మనకి సన్నిహితులైనవారు మనల్ని పలకరించకపోవడం వెనుక కారణం తెలిస్తే, వాటిని అర్ధం చేసుకోగలిగితే జ్ఞాపకం నిరీక్షణగా మరి ఒక అందమైన అనుభూతిని కలిగిస్తుంది. పరాకులోనో, కలలోనో, కనురెప్పల వెనకదాగిన కన్నీళ్ళలోనో జ్ఞాపకాలు వ్యక్తమవుతాయి. గతించిన ఆనందాన్ని వర్తమానంలో తలచుకుంటాం. బయట పొందలేని ఆనందాన్ని ఒక్కోసారి స్మరణంలో, మననంలో మన జ్ఞాపకాలలో మనం పొందవచ్చు. జ్ఞాపకానికి వయసులేదు, వృధాప్యం లేదు. వర్తమానం లేదు. మరి జ్ఞాపకాల గురించి అనేకమంది కవులు ఏమన్నారో మృణాళిని గారి విశ్లేషణలో వినండి.
...