హోమ్ టు పోలెండ్
Home To Poland
యుద్ధం - ఏంతో మంది పిల్లలని అనాధలని చేయటమే కాక, ఆస్తి నష్టం, జన నష్టంతో పాటూ ఆ ప్రాంతం రూపు రేఖలు లేకుండా చేస్తుంది. మన భారతదేశం లోనే దక్షిణ భాగంలో ఉన్న మనకి యుద్ధాలు, సరుకులు దొరకక పోవటం, రాత్రికి రాత్రి కర్ఫ్యూలు, రోజుల తరబడి బయటికి వెళ్లకుండా ఇంట్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవించటం లాంటివి లేవు. ఏడాదికి ఒక్కసారి దీపావళి రోజున పేలే బాంబులకే మనం చెవులు చిల్లులు పడుతున్నాయని, వాతావరణం పాడైందని అనుకుంటాం. కానీ కాశ్మీర్లో ప్రజలు, దేశ సరిహద్దుల్లో వారు నిత్యం ఇలాంటి వాతావరణాన్ని ఎదుర్కొంటారు.
తమ ప్రాంతాన్ని, సాంప్రదాయాన్ని, ఆస్తుల్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లి ఏళ్ల తరబడి అక్కడే జీవిస్తూ ఎప్పటికైనా తమ ఊరులో తమ సొంత ప్రాంతాలలో జీవిస్తామని ఆశతో బతుకుతున్నారు చాలామంది.
తమ దేశంలోనే వేరే ప్రాంతంలో ఉండలేని వారు, తమ దేశాన్ని వదిలి ఇంకో దేశంలో జీవించే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారు పడే మనోవేదనని ఈ నవలలో క్రిస్టినీ చాలా హృద్యంగా వివరించారు.
...