ఇల్లాలిముచ్చట్లు - విశ్లేషణ
Illalimuchhatlu - Visleshana
పత్రికలలో కాలమ్స్ రాయాలంటే అపారమైన పాండిత్యం ఉండాలి. ప్రతిభ, పాండిత్యం, అభ్యాసం ఉన్న రచయితలలే ఈ కాలమ్స్ రాయగలరు. ఇలా సంవత్సరాల తరబడి కాలమ్స్ రాసిన వారు తెలుగులో చాలామందే ఉన్నారు. వారిలో ఒకరు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. వీరు ఎన్నో నవలలు, కథలు రాసినా వీరికి బాగా పేరు తెచ్చినది మాత్రం "ఇల్లాలిముచ్చట్లు". ఈయన రాసిన ఈ ఇల్లాలిముచ్చట్లు శీర్షికలు 30 సంవత్సరాల పాటు ప్రజాదరణ పొందాయి. వీరు కొత్త రచయితలను, రచనలను బాగా ప్రోత్సహించేవారు. స్త్రీ జీవితంలోని అసంతృప్తిని, స్త్రీ తన కుటుంబం నుంచి భర్త నుంచి ఏమి కోరుకుంటోంది అనే విషయాన్నీ, వంటింటి నుంచి అంతర్జాతీయ విషయాలపై కూడా మాట్లాడే ఒక సగటు ఇల్లాలి ముచ్చట్లపై విశ్లేషణను వినండి.
Image : https://unsplash.com/photos/Ryrg8skMoyY