జన ఘన మన
Jana Ghana Mana
Sarath Babu Jandhyala
"దేశభాషలందు తెలుగు లెస్స ' అన్నారు ఎందుకు ? మన తెలుగులో మన ప్రతీ భావాన్ని వ్యక్తపరచడానికి సరైన వాఖ్యలున్నాయి.అలాగని మిగతా భాషలో లేవని కాదు. మన తెలుగులో పద్యంలో ఉండే ప్రాస, చమత్కారం, పద ప్రయోగం, ఒక మాటకి రెండు అర్ధాలు అంటే ఉచ్చారణ తో దాని అర్ధం మారేలా చేయడం ఇవన్నీ చాలా సులువు. మన కవులు వాడిన పద ప్రయోగాలు ఉదాహారణకు అల్లసాని వారి గజిబిజి అల్లికలు మన తెలుగులోనే సాధ్యం. మన తెలుగుకు ఎంతో ప్రాచుర్యం తెచ్చిన కవుల గురించి, యుగాలుగా విభజించిన కథనం , కథలు- కథానికలు, నవలలు-నవలికల మధ్య వ్యత్యాసం గురించి, మరెన్నో విషయాల గురించి ఈ 'జన ఘన మన' లో తెలుసుకుందాం.
...