జాషువ - విశ్లేషణ
Jashuva – Visleshana
C. Mrunalini
దళితుడుగా తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్న జాషువా కవిత్వంలో నిజానికి కాఠిన్యం ఉండాలి. అది న్యాయం కూడా. కానీ ఆయన కవిత్వంలో కరుణ పొంగుతుంది. అయన కవిత్వంలో కాఠిన్యం ఉంటే, అది కేవలం వివక్ష ఎదుర్కునే వారికే ఉపయోగ పడేది. కరుణ రసం వల్ల అది నలుగురిలోకి వెళ్ళింది. సమాజాన్ని ఆలోచించేలా చేసింది. సిగ్గున్న వారిని తల దించుకునేలా చేసింది. చివరికి ఆయనకు దక్కవలసిన గౌరవం తెచ్చింది. జాషువాను భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ తో సత్కరించింది. కానీ, అగ్ర కులానికి చెందిన మహా పండితుడు శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రే స్వయంగా జాషువాకి గండపెండేరం తొడగడం, పద్మభూషణ్ కంటే గొప్ప గౌరవంగా జాషువా భావించి ఉంటారు. ఈ సాహిత్య విశ్లేషణ శీర్షికలో డా. మృణాళిని గారు శ్రీ గుఱ్ఱం జాషువా మీద చేసిన విశ్లేషణను వింటే జాషువా ను ఇంకా చదవాలనే పట్టుదల పెరుగుతుంది.
Gurram Jashuva (or G Joshua) (September 28, 1895 – July 24, 1971) was a Telugu poet. A Legendary figure in the Telugu literary world. With his immmense wisdom and through the struggle he faced due to the Caste based discrimination Jashuva has wrote the poetry with an Universal approach. For his contribution to the Telugu poetry and Society he was called as "Poet of the Millennium" for his timeless pieces of poetry and Literature. [Wikipedia]