కాలాతీత వ్యక్తులు - విశ్లేషణ
Kalateetha Vyakthulu - Visleshana
P. Sridevi
మనకి తెలుగు సాహిత్యంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా కొన్ని పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చదువుకోవాలని అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో పుస్తకం వారి మనసుకు హత్తుకుంటుంది. చదివిన ప్రతిసారి ఒక్కో కొత్త కోణంలో ఆలోచింపచేస్తుంది. అలాంటి పుస్తకాలలో ఒకటి పి. శ్రీదేవి గారు రచించిన "కాలాతీతవ్యక్తులు". మొదటి ప్రచురణలోనే ఎక్కువగా అమ్ముడుపోయిన నవల ఇది. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు వారి యొక్క వ్యక్తిత్వాలను, ఆలోచనలను, ఒక తరంలో వచ్చిన పరిణామాలను తెలుపుతుంది ఈ నవల. కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పును, వివాహవ్యవస్థలో రావలసిన మార్పును గురించి తెలుపుతూ మన ఆలోచనావిధానాన్ని మెరుగుపరిచే ఈ నవలను గురించి విశ్లేషణలో వినండి.
Image : https://unsplash.com/photos/kV_u_GsXnwQ