కళ్యాణ సుందరీ జగన్నాథ్ - విశ్లేషణ
Kalyana Sundari Jagannatha - Visleshana
ఒకటో, రెండో పుస్తకాలు రాసినా ఎంతో పేరు తెచ్చుకున్నవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు శ్రీమతి కళ్యాణ సుందరీ జగన్నాథ్. 1950-60 కాలాల్లో రచయిత్రిలు అడుగు పెట్టడానికి అనువైన కాలం. ఈమె రాసిన కథలు చాలా కొన్ని మాత్రమే అయినా ఆమె ప్రతీ వాక్యంలోనూ తెలుగుదనాన్ని ఒలికించారు. వీరి కథలలో ప్రధానాంశం స్త్రీ, పురుష సంబంధాలు. అందులో ప్రణయం, భగ్న ప్రేమ ఎక్కువగా కనిపిస్తాయి.
ఈమె కథలు రాయడానికి ప్రోత్సహించినవారు ఎవరు? ఆమె పైన ఎక్కువగా ప్రభావం చూపించిన బ్రిటిష్ రచయిత ఎవరు? రచయితలను, మేధావులను ఆకర్షించిన కథాంశం ఏమిటి? ఎంతో ఉత్కంఠంగా సాగే ప్రేమ కథలకి ఆమె విషాదాంతాలే ఎందుకు రాశారో వినండి.
...