కనుపర్తి వరలక్ష్మి
Kanuparthi Varalakshmi
ఈనాడు స్త్రీలు అన్నీ రంగాల్లో విజయం సాధిస్తున్నారంటే, అందుకు 20వ శతాబ్దంలో కనుపర్తి వరలక్ష్మమ్మ వంటి ఎందఱో మహానుభావులు చేసిన కృషే కారణం. కనుపర్తి వరలక్ష్మమ్మది ఆధిక్య (privileged) కుటుంబం. ధనాధిక్యం కన్నా విద్యాధిక్యం ఎక్కువ. ఆ రెంటినీ, తన జీవితాన్ని, స్త్రీ ఉద్ధారణ కోసమే వెచ్చించారు.
ఆమె పోరాడిన అసమానతలలో కొన్ని, బాల్య వివాహం వంటివి, ఈనాడు లేవు. మరి వరలక్ష్మమ్మ గురించి, ఆమె రచనల గురించి ఈనాడు మనం ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే, ఆడపిల్ల జీవితంలో పెళ్లి ముందర కాలంలో కొన్ని మంచి మార్పులు కనబడుతున్నా, పెళ్ళైయిన తర్వాత మాత్రం పెద్ద మార్పులేమీ లేవు. బహుళ జాతీయ సంస్థైన పెప్సీ సీఈఓ అయినా, సాధారణ గృహిణి అయినా, వరలక్ష్మమ్మ చెప్పినట్టు, స్త్రీ ఇంకా మగవాడి సొత్తే. ఫేస్‌బుక్ COO, షెరిల్ సాండ్బర్గ్ వ్రాసిన 'లీన్ ఇన్' పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా, ఉద్యోగం చేసే మహిళల్లో స్ఫూర్తిని నింపింది. ఒక్కసారి వరలక్ష్మమ్మ జీవితం, రచనల గురించి, వాటిని ఆమె రాసిన సాంఘిక నేపధ్యం గురించి, డా. మృణాళిని చేసిన ఈ విశ్లేషణ వింటే, దానికి రెండింతలు ప్రేరణ కలుగుతుంది.
This is a short analysis of one of woman literary luminaries of the 20th century, Smt. Kanuparthi Varalakshmi.