కావ్య భారతి
Kavya Bharathi
Mythili Abbaraju
పురాణాలూ, ఇతిహాసాలు అన్నీ కథలుగా ఉంటే చాలామందికి బాగా అర్ధమవుతాయి.అలాగే కావ్యాలు కూడా. వాల్మీకి, తులసీదాస్ ఇలాంటివారు రాసినవి శ్లోకాల రూపంలో ఉన్నందువల్ల చాలామంది వాటిని చదవడంలేదు. వాటిలోని సారాన్ని జనసామాన్యానికి అర్ధమయ్యేలా చెబితే అవి ప్రతి ఒక్కరి నోటా ప్రతిచోటా స్మరించబడతాయి. అలాగే మనకు శాకుంతల, దుష్యంతుని గురించి కాళిదాసుగారి రచన కావ్యరూపంలో ఉండడం చేత రకరకాల కథలు ప్రాచుర్యంలోఉన్నాయి. ఒక్కో పదానికి నానార్ధాలు ఉండడం చేత ఆ పదాన్ని ఏ భావంలో కాళిదాసుగారు అక్కడ వాడారో వివరిస్తూ చాలా సులభంగా మైథిలిగారు వివరించారు.
...