కృష్ణకుమారి తో ముఖాముఖీ
Krishna Kumari - Mukhaamukhee
ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకే రంగంలో ఉన్నా ఎవరి ప్రత్యేకత వారిదిగా నిరూపించుకున్న వారిలో ఒకరైన అందాలనాటి కృష్ణ కుమారి గారితో పరిచయం విందాం. సాంప్రదాయ కుటుంబాలలో పుట్టి పెరిగిన ఆడపిల్లలు నటించడం అంటే ఎంతో ఇబ్బందిగా ఉన్న ఆ రోజుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న కృష్ణ కుమారిగారి సినీరంగ ప్రవేశం, ఆవిడని వాళ్ళ నాన్నగారు ప్రోత్సహించిన తీరు, ఆమె మొదటి సినిమా గురించిన వివరాలు మరియు అప్పటి హీరోయిన్ల మధ్య ఎలాంటి పోటీ ఉండేది? అందరిలో అందాల నటిగా పేరు తెచ్చుకున్న ఆమె సౌందర్య రహస్యం ఏమిటి? NTR గారు ఆమెను రెండుసార్లు ప్రమాదాల నుంచి ఎలా కాపాడారు? ఆమెకు పెళ్ళైన తరవాత తన నటనను ప్రోత్సహించినదెవరు? ఇంకా ఆమెకు వచ్చిన అవార్డులు, నచ్చిన పాత్రలు, దర్శకులు, పాటలు, ఈ తరం హీరోయిన్లలో నచ్చినవారు ఇలాంటి విషయాలను మృణాళిని గారు ముఖాముఖీ లో మనకందించారు. వినేద్దాం మన దాసుభాషితం లో.
...