మ్యాన్ షై
Man Shy
Frank Devison
మనిషి ఎంత నాగరికుడు అవుతూ, ఎదుగుతున్నా అతనిలో పైశాచికత్వాన్ని కొన్ని కొన్ని చోట్ల చూస్తూనే ఉంటాం. అడవిలో హాయిగా ప్రకృతి ఒడిలో పెరుగుతున్న ఒక ప్రాణిపై, మానవుని యొక్క విషపునీడలు ఏ విధంగా ప్రభావం చూపాయో చెప్పే కథే ఈ "మాన్ షై" మనిషి తన స్వార్థం కోసం, ఆనందం కోసం అడవిలో స్వేచ్ఛగా విహరించే జంతువుల్ని చంపుతున్నాడు. కబేళానికి తన తల్లి బలైపోగా, ఎర్ర ఆవు ఒంటరిదై పోతుంది. ఏ పశువు తన పిల్లని తప్ప వేరే పిల్లని దగ్గరకి తీయదు ఇది పశువు ధర్మం. కానీ ఎర్ర ఆవుని ఒక ఆవు దగ్గరకి తీస్తుంది. అది పెద్దదై ఆ అడవిలో స్వేచ్ఛగా తిరుగుతుంటే మాంసంకోసం పశువుల్ని పట్టుకునే వాని చేతిలో చిక్కుతుంది. అతి కష్టం మీద వారి నుండి తప్పించుకున్న ఎర్రావు ఏమవుతుందో వినండి.
...