మాన్ ట్రాప్
Man Trap
Sinclair Lewis
ఈ ప్రపంచంలోని జనాలు హడావిడిగా, దేనికోసం ఆరాటపడుతున్నామో తెలీక పరిగెడుతూనే ఉన్నాము. డబ్బు సంపాదనకోసం ఆరాటం, తీరికలేని జీవితము, చాలీ చాలని జీతం, అనారోగ్యం, ఆదుర్దా. ఈ వేగంలో తనను తాను రోబోట్ లాగా చేసుకున్నాడు. ఇదే కథాంశాన్ని తీసుకుని రాసిన 'మాన్ ట్రాప్ ' అనే నవల యొక్క విశ్లేషణ విందాం. రాల్ఫ్ బ్రహ్మచారి. అతని తల్లి అన్నీ తానై చూస్తుంటే అతని జీవితం నడుస్తుంది. కానీ తల్లి మరణం తరువాత అతనిని ఒంటరితనం వేధిస్తుంది. ఒంటరి జీవితం అతనిని భయపెడుతుంది. ప్రశాంతత కోసం తనకు నచ్చకపోయినా వుడ్ వర్రీ తో పాటూ పడవలో విహారానికి వెళ్తాడు. వర్రీ, రాల్ఫ్ ను మాటలతో హింసించడం వర్రీ స్నేహితుడు జో చూసి, అతన్ని తనతోపాటు తీసుకెళతాడు. అక్కడ జో భార్య అవెన్నా, రాల్ఫ్ ను చూసి అతని వ్యామోహంలో పడుతుంది. జో కు అన్యాయం చేయడం ఇష్టంలేక రాల్ఫ్ పారిపోతుంటే, అవెన్నా అతనితో పాటూ వచ్చేస్తుంది. వీరిద్దరూ జో కు దొరికిపోతారు. తరువాత ఏం జరుగుతుందో ఈ విశ్లేషణలో వినండి.
...