మ్యాన్ ఉమెన్ అండ్ చైల్డ్
Man Woman and Child
ఆడది ఎంతటి కష్టానయినా భరిస్తుందిగాని తన భర్త ఇంకో ఆడదానితో సన్నిహితంగా ఉంటే తట్టుకోలేదు. విశ్వంలో ఉన్న ఏ పిల్లలపైనైనా తన తల్లిప్రేమని చూపగలదు కానీ తన భర్త వల్ల ఇంకొకరికి కలిగిన సంతానంపై ఆ ప్రేమను చూపలేదు. రాబర్ట్ తన ఇద్దరి పిల్లలతో, అందమైన భార్యతో చక్కటి జీవితాన్ని సాగిస్తున్నాడు. రాబర్ట్ కి ఒక రోజు డిప్యూటీ మేనేజర్ మాన్ ప్రో నుంచి ఒక కబురు వస్తుంది నికో మరణించిందని. దాంతో అక్కడికి ఆదరాబాదరాగా వెళ్ళి అక్కడి పరిస్థితులు తెలుసుకుని వాటిని చక్కదిద్ది అక్కడి నుంచి జోన్ అనే కుర్రాడిని తన ఇంటికి తీసుకు వస్తాడు రాబర్ట్. మొదట జోన్ ను తల్లిదండ్రులు కోల్పోయిన తన ఫ్రెండ్ కుమారుడిగా పరిచయం చేస్తాడు. ఆ ఇంట్లో అందరూ జోనపై విపరీతమైన అభిమానంతో చూస్తారు. షైలాకి (రాబర్ట్ భార్య) తెలిసిన ఒక విషయం వల్ల జోన్ ను రాబర్ట్ అనాథశరణాలయంలో వదిలేయాలనుకుంటాడు. కానీ ప్రతీ స్త్రీలోనూ ఉండే తల్లి హృదయం జోన్ ను మరలా చేరదీస్తుంది. జోన్ ను శరణాలయంలో వదిలేయాలనుకునేంతగా జరిగిన సంఘటన ఏమిటో వినండి.
...