మదర్ సుపీరియర్
Mother Superior
Jen Trehe
చిన్న పిల్లలో ఉండే అల్లరితనము, మొండితనం పెద్దవాళ్ళకి ఏంతో చికాకు తెప్పిస్తాయి. వాళ్ళని ఎలా మంచిదారిలో పెట్టాలి అనే విషయం ఒక్కోసారి మనకి చాల ఇబ్బందిగా, ఒక పెద్ద ప్రశ్నగా కూడా అవుతుంది. అలాంటి ఇద్దరి పిల్లల గురించి చెప్పే కథే ఈ 'మదర్ సుపీరియర్' . పిల్లల్ని హాస్టల్లో ఉంచితే క్రమశిక్షణతో ఉంటారని అందరం భావిస్తాం. జేన్,మేరీలు కూడా ఇలా హాస్టల్ లో ఉంటూ ఎలాంటి అల్లరి చేసారు, మదర్ సుపీరియర్ పిల్లలకి చదువుతో పాటు ఇతర వ్యాపకాలు నేర్పించడం కోసం పడే తపన, లెక్కల టీచర్ మరణం వల్ల పిల్లలో కలిగిన తీవ్రమైన బాధ, 10 డాలర్ల బహుమతి కోసం జేన్ చేసిన పని, దానికి సుపీరియర్ చేసిన సాయం వీటితో పాటు స్కూల్ విడచి పై చదువులకి ఎవరి దారిన వారు వెళ్ళేటప్పుడు జేన్ తో సమానంగా అల్లరి చేసే మేరీ అందరిని ఆశ్చర్య పరిచేలా తీసుకున్న నిర్ణయం గురించి ఈ నవల విశ్లేషణలో వినండి.
...