ముఖాముఖీ - శ్రీ సంగీత రావు
Sri Sangeeta Rao – Mukhaamukhi
అలనాటి తెలుగు సినీ సంగీత మూల విరాట్టు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మేధస్సుకూ సామర్ధ్యానికీ మూలకారకులు విద్యార్థి దశలో వారి గురువు గారైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారైతే సినిమా రంగ ప్రవేశం చేశాక, అటు గాయకుని గానూ ఇటు సంగీత దర్శకునిగానూ చేతినిండా పని ఉన్న రోజుల్లో, పని భారాన్ని పంచుకుంటూ వారికి సహాయకులుగా ఉన్నవారు గురువుగారి కుమారుడైన శ్రీ పట్రాయని సంగీతరావు గారు. అలా వారు కోరి తెచ్చుకున్న సంగీతరావు గారు తన తండ్రిగారి ప్రియ శిష్యుడైన ఘంటసాల గారు తుది శ్వాస విడిచేవరకూ చేదోడు వాదోడుగా ఉండి వారి ప్రతి విజయంలోనూ తనకంటూ ఒక భాగాన్ని ఎర్పరచుకున్నారు. ఈ ముఖాముఖీలో శ్రీ సంగీతరావు గారు, ఘంటసాల గారి తో తన అనుబంధం గురించి, సంగీతానికి సంబంధించి అనేక విషయాలను విపులంగా వివరించడం మీరు వింటారు.
A rich interview with Sri Sangeeta Rao, friend, co-creator, and confidant of the scion of Telugu Film Music, Sri Ghantasala Venkateshwara Rao. This is a must-listen interview for Sri Ghantasala's fans.