నెర్వ్
Nerve
Dig Francis
జీవితంలో గెలుపు ఓటమిలు సర్వసాధారణం. కానీ కొంతమందికి అదే జీవనాధారంగా, పరువుకు సంబంధిచినదిగా, వారి జీవితాలనే శాసించేదిగా ఉంటుంది. డిక్ ఫ్రాన్సిస్ జాకీగా ఎన్నో బహుమతులు సంపాదించి, చిన్న ప్రమాదానికి గురై గుర్రపు స్వారీ చేయలేక చివరికి రచయితగా స్థిరపడి అందులోకూడా మంచి స్థానాన్ని సంపాదించుకుంటాడు. డిక్ జాకీలపై, గుర్రపు స్వారీలపై అనేకరచనలు చేశాడు. జాకీల జీవితాలు తమ ప్రాణాలతో తామే చెలగాటమాడుతున్నట్టు ఉంటాయి. ఈ 'నెర్వ్' నవలలోని రాబ్ ఎంతటి పొగరుబోతు గుఱ్ఱానైనా లొంగదీసుకునేవాడు. తాను మంచి జాకీగా పేరు తెచ్చుకుంటునప్పుడు,అతని కళ్లెదురుగానే మరో జాకీ ఆర్ట్ ఆత్మహత్య చేసుకుంటాడు. పీటర్ అనే ఇంకో జాకీ తమ పిల్లల ఆకలి తీర్చలేని దుస్థితికి చేరుకుంటాడు. ఇలా జాకీగా ఎన్నో విజయాలు సాధించినవారు కేంఫోర్ కారణంగా ఇలాంటి స్థితికి చేరుకుంటారు. అసలు ఈ కేంఫోర్ ఎవరు? అతను ఎందుకు ఇలా చేసాడో ఈ విశ్లేషణలో వినండి.
...