నిత్య సినీ మధురాలు 1
Nitya Cinee Madhuraalu 1
Konduru Tulasidas
మంచి పాట మనసుకి హాయినిస్తుంది. కొన్ని మంచి పాటలు వినడం వల్ల మన మనసులో ఉండే చికాకులు, బాధలు పోతాయి. పాతపాటల్లో సంగీతానికి, సాహిత్యానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. కొంతమంది నటులు వారే తమ సొంత గళంలో పాడుకునేవారు. ఉదాహరణకి నాగయ్య, శాంతకుమారి, వరలక్ష్మి, భానుమతి. మన పాత పాటల్లో ఉండే సాహిత్యం వల్ల మనకు తెలీని కొన్ని క్రొత్త తెలుగు పదాలు తెలుసుకోవచ్చు. సహజంగా వాడే పదాలే అయినా మాండలికాల్లో తేడాలవల్ల మనకి అవి కొత్తగా కనిపించవచ్చు. పాటలు పాతవే అయినా వాటిలోని మాధుర్యాన్ని, అందాన్ని, సంగీత వాయిద్యాల సొగసుని, వాటిని ఉపయోగించిన తీరును తులసీదాసుగారు వివరించారు. ఆనాటి ఆ'పాత' మధురాలని "నిత్య సినీ మధురాలు" గా మన దాసుభాషితంలో వినండి. సంగీత, సాహిత్య, వాయిద్యాలలో సొగసుని, అందాన్ని "నిత్య సినీ మధురాలు" లో వినండి.
...