నార్త్ అండ్ సౌత్
North & South
Elizebeth Gaskell
కార్మికునికి యజమానికి మధ్యన ఉన్న సమరసభావాన్ని, మానవబంధాన్ని గురించి తెలుపుతుంది ఈ నవలా విశ్లేషణ. చిన్నప్పటి నుంచి పల్లెటూరిలో పెరిగి ఆవాతావరణంలో హాయిగా ఉన్న మార్గరెట్ తన పిన్ని కూతురి పెళ్ళికి సాయానికి పట్నం వస్తుంది. అక్కడి అలవాట్లను, వాతావరణాన్ని అలవరచుకుని అందరికి తలలోని నాలుకలా ఉంటుంది. ఆ పెళ్ళిలో మార్గరెట్‌ని చూసి పెళ్ళికొడుకు అన్నగారు హెన్రి మార్గరెట్‌ని పెళ్లి చేసుకుందామనుకుంటాడు. కానీ మార్గరెట్‌ని ఇష్టపడదు. అయితే మార్గరెట్ తండ్రి హాల్ డబ్బులు బాగా సంపాదించాలని చక్కటి పల్లెటూరి వాతావరణం వదలి, పొగగొట్టాలతో కాలుష్యంతో నిండిన ఉత్తరంవైపుకు ప్రయాణమవుతారు. సాహిత్యం పై మక్కువ ఉన్న ధోర్టన్‌కి మాష్టారుగా హాల్ నియమింపబడతాడు.ధోర్టన్‌మార్గరెట్ భావాలకు ,ఆదర్శాలకు ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకుంటానంటాడు.కానీ అతని తల్లికి ఇష్టముండదు. అక్కడి వాతావరణానికి మార్గరెట్ తల్లికి ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆమె మరణం తో నిర్వేదం లోకి వెళ్లిన హాలును అతని స్నేహితుడు బెల్ తన ఇంటికి తీసుకెళతాడు. కానీ భార్య మీద బెంగతో హాల్ మరణిస్తాడు.ఒంటరిదైన మార్గరెట్‌కు బెల్ తన ఆస్తిని రాసిస్తాడు. లండన్ లోని ఆర్ధిక అసమానతల కారణంగా ధోర్టన్ వ్యాపారం దెబ్బతింటుంది. తరువాత ఎలాంటి మార్పులు జరిగాయి? ధోర్టన్,మార్గరెట్లు కలుసుకున్నారా? ఈ విశ్లేషణలో వినండి.
Image : https://bookshelffantasies.files.wordpress.com/2015/11/northandsouth1.jpg