పైడిపాల - ముఖాముఖీ
Paidipala - Mukhamukhee
తెలుగు సినిమా పాటలు-చరిత్ర పై ఎంతో పరిశోధన చేసిన పైడిపాల గారితో మృణాళిని గారి పరిచయం విందాం. 'తెలుగు సినిమా పాట చరిత్ర' అనే అంశం మీద ఎందుకు పరిశోధన ఎంచుకున్నారు? తొలి తెలుగు సినీ కవి ఎవరు? అనే వాటిపై వారి వివరణ విందాం. సాహిత్య చరిత్రని యుగాలుగా విభజించారు. అలాగే సినిమా పాటను కూడా పైడిపాల గారు యుగాలుగా విభజించారు. శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల వలె, మన తెలుగు సినీపాటల చరిత్రలోని అష్టదిగ్గజాల గురించి వివరించారు. ఆత్రేయ-మహదేవన్, వేటూరి-చక్రవర్తి, ఇళయరాజా-వేటూరి వీరి మధ్య అనుబంధం గురించి,ఈనాటి సాహిత్యలో వచ్చిన మార్పుల గురించి వివరించారు. మరి ఆ విషయాలను, విశ్లేషణను, వివరాలను మన దాసుభాషితంలో విందాం...
Image : https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2021/06/4/spb-paidipala.jpg?itok=vR5WPKTj