హీర్ - రాంఝా
Heer - Raanjha
ప్రేమ - దీనిని ఒక్కొక్కరు ఒక్కోరకంగా వారి మనసులో కలిగే భావాలకనుగుణంగా నిర్వచిస్తారు.
ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటైన్ డే సాక్షిగా ప్రేమికులందరు ప్రేమను సఫలం చేసుకోవాలనే అనుకుంటారు. కానీ విచిత్రంగా, ప్రేమించి పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్న ఓ సగటు వెంకటేశం - పద్మ కథ కన్నా విఫలమైన కథలే ఎక్కువ ప్రసిద్ధి పొందాయి. చరిత్రలో లైలా - మజ్ను, సలీమ్ - అనార్కలి, రోమియో - జూలియట్, దేవదాస్ - పార్వతి వీరి గాథలే మనకు ఎక్కువగా వినవస్తాయి.
ఈ కథల సరసన ఉండే, ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువగా చెప్పుకునే, హీర్ - రాంఝా ల ప్రేమ ఏవిధంగా మలుపులు తిరిగిందో, వారి ప్రేమకు అన్ని ప్రేమ కథలలానే జాతి, మతం ఏవిధంగా అడ్డువచ్చాయో మృణాళిని గారి విశ్లేషణలో విందాం.
...