రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ - విశ్లేషణ
Rallapalli Anantha Krishna Sarma
సంగీతం, సాహిత్యం లో ప్రవేశం ఉన్నవారికి చాల సుపరిచితులు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు. కన్నడం, సంస్కృతం, ప్రాకృతం, తెలుగు, తమిళంలో ఆయన అనర్గళంగా మాట్లాడగలరు, రాయగలరు. సాహిత్యం విషయంలో చాలా కచ్చితమైన అభిప్రాయంతో, నిర్మొహమాటంగా ఉన్నందున వీరు రచయితగా కన్నా విమర్శకునిగా ప్రఖ్యాతి చెందారు. వీరు సాహిత్యంలో 'భావన' కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. వీరు చాలా తక్కువగా రచనలు చేశారు. వీరు అనువదించిన పుస్తకాలలో హాలుని "గాథా సప్తశతి" అతి అరుదుగా లభిస్తుంది. అన్నమాచార్యుని కీర్తనలకు బాణీకట్టారు. ఈయన వాగ్గేయకారుడు కూడా, కానీ అవి ప్రచారంలోకి రాలేదు. 'తిక్కన తీర్చిన సీత' - అనే తన వ్యాసంలో సీతను గూర్చి మరియు నాటకాలపై వారికున్న అభిప్రాయాలను ఇంకా రాళ్ళపల్లి గారి వ్యక్తిత్వం, వారి సూక్తులు వంటి విషయాలను మృణాళిని గారి విశ్లేషణలో విందాం.
...