రావు బాల సరస్వతి - 90వ జన్మదిన ప్రత్యేకం
Ravu Bala Saraswati 90th birthday special
కొందరి పేర్లు వినగానే ఘనమైన ఒక చరిత్ర మన కళ్ళముందు నిలుస్తుంది. అలాంటి వాటిలో ప్రముఖంగా పేర్కొనదగిన పేరు రావు బాలసరస్వతి. ఆమె పేరు తలపుకు రాగానే అరవై సంవత్సరాల క్రితమే ఆకాశవాణి సంగీత కార్యక్రమాల్లో లలిత గీతాలతో శ్రోతలను అలరించిన మృదు మధుర కంఠస్వరమూ మదిలో మెదుల్తుంది. కారణం, రేడియో మాధ్యమంలో లలిత సంగీతం ఆమె పాటతోనే ప్రారంభమైంది. ఆమె పాడిన వైవిధ్యభరితమైన వేలాది పాటలనుంచి సందర్భోచితమని తోచిన వాటిని ఎంచుకుని ఆమె తొంభయ్యవ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలతో ప్రత్యేకంగా అందిస్తున్నది ‘దాసుభాషితం’ వినండి – “తెలుగు పాటకు రాజమాత – రావు బాలసరస్వతి”
A special programme on a very special artist, Smt. Ravu Bala Saraswati on the occasion of her 90th birthday. Listen to interesting commentary and some of her best songs.