షేక్స్ పియర్ హాస్యం - విశ్లేషణ
Shakespeare Comedy (VS)
తెలుగు రచయితలు ఎందరో అభిమానించే పాశ్చాత్య తత్త్వవేత్త, రచయిత షేక్స్ పియర్ యొక్క నాటకాలలో హాస్యాన్ని గురించి మృణాళిని గారి విశ్లేషణలో విందాం. షేక్స్ పియర్ పై ఆయన రచనల పై ఎన్నో విమర్శలు ఉన్నాయి. వీరి రచనలను 3 రకాలుగా విభజిస్తారు. లోకంలో జరిగే ప్రతీదానికి మూలం, ఆధారం భారతంలో ఉన్నట్టే, బ్రిటిష్ వారి హాస్యానికైనా, విషాదానికైనా మూలాలు షేక్స్ పియర్ రచనల్లో దొరుకుతాయి. ఎన్నో రకాల మనస్తత్త్వాలు వీరి రచనల్లో మనకు తారసపడతాయి. వీరి నాటకాల్లోని వైవిధ్యం, వ్యూహాలు, విధానాలు ఏమిటో,హాస్యంలోని ప్రత్యేకత ఏమిటో ఇంకా వీరి నాటకాలను విమర్శించే వారికి వాటిలోని లోతుల్ని విశ్లేషించింది ఎవరో వినండి.
Image - https://unsplash.com/photos/ABUWC-0a7_A