షేక్స్ పియర్ - విషాదం (విశ్లేషణ)
Shakespeare Tragedy (VS)
షేక్స్‌పియర్ ను ఇంగ్లీష్ భాషలోనే శ్రేష్టుడిగా చెబుతారు. సాహిత్యంలో హాస్యానికి, విషాదానికి విడివిడిగా స్థానాన్ని చూపించారు ఈయన. సాహిత్య ఆరాధకులందరికి ఆరాధ్యుడు. సాహిత్యంలో విషాదానికి ఒక ఘాడతను, గొప్ప ఆకర్షణను, సౌందర్యాన్ని తీసుకువచ్చారు. షేక్స్ పియర్ నాటకాలు దృశ్య కావ్యాలకు, దృశ్య సాధనాలకు ముడిసరుకును అందించాయి. వీరు రాసిన నాటకాలు విషాదాంతాలు అయినా గొప్పగా ప్రజాదరణ పొందాయి. వీటిలో కొన్ని ప్రేమకు, మృత్యువుకు, విధికి ఉన్న సంబంధాన్ని వ్యాఖ్యానించిన గొప్ప కావ్యం రోమియో-జూలియట్. విధికంటే మనస్తత్వాలే విషాదానికి కారణాలుగా చూపిన నాటకం కింగ్ లియర్. దీన్ని సవరించి సుఖదాంతం చేసి మళ్ళీ కొన్ని ఏళ్ళ తరవాత యధాతథంగా ప్రదర్శించారు. ఈర్ష్యనే ప్రధానాంశంగా చూపి విషాదాంతంగా మలచిన మరో నాటకం ఒథిల్లొ. దీన్ని ఎన్నో మాధ్యమాల్లో దృశ్య కావ్యంగా కూడా తీశారు. వీటి గురించి మరింత వివరణని మృణలినిగారి విశ్లేషణలో వినండి.
Image : https://unsplash.com/photos/52jRtc2S_VE