షావుకారు జానకి తో ముఖాముఖీ
Shavukaru Janaki
అందం,ఒడ్డూ, పొడుగూ,మంచి ఆహార్యం వంటివి సినిమాలకు కావలసిన లక్షణాలు. ఇవేవి లేక పోయినా, చేసినవి కొన్ని పాత్రలే అయినా, తన వాక్పటిమతో ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్న నటి "షావుకారు"జానకి. తన మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంతగా ఆమె షావుకారు లో అభినయించారు.
మంచి సంప్రదాయంలో పుట్టి పెరిగిన ఆమె, సినీ రంగంపై చాలా చిన్న చూపు ఉన్న ఆకాలంలో సినిమాల్లో ఎందుకు చేరారు? మిగతా నటులతో జానకి గారి కున్న సంబంధాలు ఎలా ఉండేవి, అప్పటి వాళ్ళ కష్టాలు, ఆమె వేసిన పాత్రల గురించి, ఆ తరానికి ఈ తరానికి ఉన్న వ్యత్యాసం, జీవితంపై, ప్రేమపై ఆవిడ నిర్వచనం, తాను పనికి రాదు అన్న చోటే తనను నటిగా నిలబెట్టుకోడానికి ఆమె పడిన కష్టం, ఇంకా మరెన్నో విషయాల గురించి మృణాళిని గారి ముఖాముఖీలో వినండి.
Image : https://www.thehindu.com/entertainment/movies/pmhvx1/article34442601.ece/alternates/FREE_435/30frsowcar-old