శ్రీపాద మ్యూజింగ్స్ - విశ్లేషణ
Sreepada Musings - Visleshana
ఒక వ్యక్తి తన గురించి తాను రాసుకునే పుస్తకాన్ని స్వీయ చరిత్ర అని జీవిత చరిత్ర అని అంటాం. కానీ మూసింగ్స్ అంటే ఏంటి? శ్రీపాద వారిది శుద్ధ శోత్రీయ కుటుంబం. వీరి కుటుంబ సభ్యులు అందరూ సంస్కృత పండితులు. వీరూ సంస్కృత పండితులు.అయితే వీరికి తెలుగు పై ఇష్టం ఎలా ఏర్పడింది? వీరు వేదాలు, స్మార్తం, జ్యోతిష్యం ఇన్ని నేర్చుకున్నా వాటి మీద ఎందుకు విరక్తి పెంచుకున్నారు? వారాలు చేసుకుంటూ చదువు నేర్చుకోడంలో వారు నేర్చుకున్న సిద్దాంతం ఏంటి? హైందవ సంస్కృతిలో కులం, శాఖ, ఆచారాలు, కట్టుబాట్లు, నమ్మకాలూ ఎలా వ్యక్తి జీవితాన్ని శాసిస్తాయో, క్రమేపి అవి ఎలా బంగారు సంకెళ్లు అవుతాయో వారి అనుభవాలు - జ్ణాపకాలు లో వివరించారు. ఇంకా కవి గురించి, కవిత్వం గురించి ఈ సమాజంలో అతని స్థానం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటో వినండి విశ్లేషణ లో.
...