శ్రీ కెబికె మోహన్ రాజు
Sri KBK Mohan Raju
కే.బి.కే మోహనరాజు. ఇది తెలుగు లలిత సంగీతాభిమానులకు చిరపరిచితమైన పేరు. చాలామంది లాగే వృత్తి రీత్యా వీరు కూడా ఒక ప్రభుత్వోద్యోగి. కానీ ప్రవృత్తి వేరు. అదే పాటలు పాడటం. అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో కూడా పాడినప్పటికీ, వీరు ప్రధానంగా లలిత సంగీత గాయకులు. రేడియోలో ఆ విభాగానికి చెందిన టాప్ గ్రేడు కళాకారులు. కొన్ని వందల కార్యక్రమాలలో శ్రీ చిత్తరంజన్, వోలేటి వెంకటేశ్వర్లు, పాలగుమ్మి విశ్వనాధం వంటి ప్రముఖులు స్వరపరచిన వేలకొద్దీ మృదుమధురమైన పాటలు పాడారు. దేశ విదేశాల్లో సంగీత కచేరీలు చేశారు. ఆకాశవాణి లలిత సంగీత విభాగానికి కళాకారులకు గ్రేడింగు ఇచ్చే ‘జాతీయ ఆడిషన్ కమిటీ’లో సభ్యులుగా ఉన్నారు. అనేక పురస్కారాలు అందుకున్నారు సన్మానాలు పొందారు. వివిధ సాంస్కృతిక సంస్థలు యువతీ యువకులకు నిర్వహించే లలిత సంగీత పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. శ్రీ మోహనరాజుగారు పరమపదించే కొన్ని వారాల ముందే ‘దాసుభాషితం’ వారిని పలకరించింది. తన జీవన యానంతో పెనవేసుకొన్న లలిత గానానికి సంబంధించి ఎన్నో విషయాలు మనసు విప్పి మనతో పంచుకున్నారు.. అరుదైన పాటలు వినిపించారు. మీరు విని ఆనందించండి.
An interview with a popular name in Telugu Light Music, Sri KBK Mohan Raju. This program was recorded just weeks before the lovely singer passed away.