శ్రీ మాధవపెద్ది సురేష్
Sri Madhavapeddi Suresh
విరిసినది వసంత గానం......
చాలామంది జీవితాలు వడ్డించిన విస్తరులు కావు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, జీవిత గమ్యం ఏమిటో, ఏ రంగంలో స్థిరపడాలో తెలియని వయసులో, తనకు తెలియకుండానే సంగీత ప్రపంచంలో పడ్డారు. ఏ గురువు గుమ్మం ఎక్కకుండానే హార్మోనియం వాయించటం నేర్చుకున్నారు. ఆ అనుభవంతో ఒక ‘అకార్దియన్’ కొనుక్కుని దానిమీద ప్రావీణ్యం సంపాదించారు. అంచెలంచెలుగా ఎదిగారు. సంగీత కచేరీలలో వాయిస్తూ కుటుంబానికి ఆర్ధిక పరమైన ఆసరాగా ఉన్నారు. ఒక సారి ఒక కచేరీలో పాల్గొని స్వస్థలానికి తిరిగి వెళుతుండగా, ప్రయాణంలో ఎవడో ఆ అకార్దియన్ వాయిద్యం ఉన్న పెట్టెను సూటు కేసు అనుకుని దానిలో ఏ 'కొంచె'మైనా ఉండకపోతుందా అని దాన్ని కాస్తా లేపేశాడు. ఉపాధి ఆసరా ఊడిపోయింది. ఇలాంటి కష్టాలు ఎన్నో. అయినా కృంగిపోలేదు, నిరుత్సాహ పడలేదు నమ్ముకున్న రంగాన్నీ వీడనూ లేదు. మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. ఫలితం – ‘స్వయంకృషి’కి నిర్వచనం,,పర్యాయం, ఆ పదానికే నిలువెత్తు సజీవం, నేటి సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకులు శ్రీ మాధవపెద్ది సురేశ్. వారితో దాసుభాషితం ‘ముఖా-ముఖీ’ వినండి.
An interview with well-known Telugu Music Director Sri Madhavapeddi Suresh.