Sri Krishnaastami - Visleshana
భువన మోహనుడు, రాధా వల్లభుడు, గోపిక మానసచోరుడు, వెన్న దొంగ ... ఇలా ఎన్ని పేర్లు చెప్పినా సరిపోదు. నల్లనివాడైనా, ప్రతీ ఒక్కరినీ తన చిలిపి పనులతో ఆకట్టుకునే వాడు శ్రీకృష్ణుడు. దేవకికి అష్టమ గర్భంలో జనియించి, కంసుణ్ణి సంహరించి, యాదవుల్ని తన వేణుగానంతో సమ్మోహనంలో ముంచెత్తాడు. తానొక్కడే అయినా ఎంతో మంది గోపికలకు తన ప్రేమను పంచాడు. పాండవులకు తోడుగా ఉంటూ ధర్మాన్ని రక్షించాడు. రాజనీతిని భోదించాడు. గీత ద్వారా సర్వ జనులకు ధర్మాన్ని, దాన్ని కాపాడే విధానాన్ని, ఆనందాన్ని కలిగించాడు. అటువంటి ఆ జగన్మోహనుని గురించి, కృష్ణాష్టమి గురించి ఈ విశ్లేషణలో వినండి.
Image : https://unsplash.com/photos/164vZDZ4MmM