సన్‌లైట్ ఆన్ ఎ బ్రోకెన్ కాలమ్
Sunlight on a Broken Column
Attia Hosain
స్వతంత్య్రం వచ్చినా స్త్రీకి మాత్రం కొన్ని కట్టుబాట్లు ఉంటూనే ఉన్నాయి. అందులోను ముస్లింలలో మరి ఎక్కువుగా ఉంటాయి. ఈ నవల రచయిత్రి ఆనాటి ముస్లింలలో జమీందారీ వంశంలో పుట్టి బాగా చదువుకున్న స్త్రీ. వీరు ఆ కాలంలోని వారి మతంలో ఉండే కట్టుబాట్లను గురించి వర్ణించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకొని తాతగారి వద్ద పెరుగుతుంది లైలా. స్వతంత్ర భావాలున్నతాతగారు లైలా పెదనాన్నను, తండ్రిని విదేశాలకు పంపి చదివిస్తారు. వారు తమ దేశంలో జరిగే స్వాతంత్య్రసమరంలో సహాయపడతారని భావించారు. కానీ విదేశాలలో చదువుకున్న పెదనాన్న కుటుంబం నాగరికతకు అలవాటు పడతారు. తాతగారి హయాంలో ఉన్న కట్టుబాట్లు క్రమేపి సడలిపోతాయి ఆ ఇంట. తాతగారి వద్ద పెరిగిన లైలా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆ తరువాత ఆమె జీవితం ఎలా ఉంది? ఆమెను ఎంతగానో ప్రేమించిన మేనత్త ఏమైంది? ఆమె భర్త, మేనత్త కాకుండా లైలాను ఎంతగానో ఆరాధించిన వ్యక్తి ఎవరో ఈ విశ్లేషణలో వినండి.
...