తెలుగు సాహిత్యంలో ప్రకృతి - విశ్లేషణ
Telugu Sahithyamlo Prakruthi - Visleshana
తెలుగు సాహిత్యానికి ప్రేరణ సంస్కృత సాహిత్యం. ప్రకృతి - పురుషుడు అనే తత్వం భారతీయ సాహిత్యంలోనూ, తాత్వికతలోనూ చాలా ముఖ్యమైనది. కావ్య ప్రభంధాలలో ప్రకృతిని వర్ణించడం పరిపాటి అయ్యింది. వర్ణనకు ప్రకృతి ప్రస్థావన తప్పదు. అన్ని అలంకారాలు ప్రకృతి మీదే ఆధారపడి ఉన్నాయి. ప్రకృతి అన్నింటికీ ప్రత్యక్ష సాక్షి. ప్రకృతిని సాహిత్యకారులు తమ జీవితంలో భాగస్వామిగా, స్నేహితుడిగా, దేవతగా, తోడుగా చూశారు. మనిషిలోని భావాలకు అభివ్యక్తిగా ప్రకృతిని చూశారు. ఇంకా ప్రకృతికి, కళలకు సంబంధం, ప్రాచీన కవులు , ఆధునిక కవులు ప్రకృతిని తమ సాహిత్యంలో వర్ణించిన తీరు విశ్లేషణలో వినండి.
Kunal Shinde on Unsplash