ది గర్ల్ ఇన్ ది వైట్ షిప్
The Girl In The White Ship
ఎన్ని విపత్తులు జరిగినా, ఎన్ని ప్రకృతి విలయాలు జరిగినా మనిషి భగవంతునిపై నమ్మకాన్ని కోల్పోకూడదు. ఈ సృష్టిలో ఏది జరిగినా అది మన మంచి కోసమే అనుకోమంటారు. మనిషిని ఏదో ఒక ఆశ నడిపిస్తుంది. మనం ఉన్న ప్రదేశాలు నివాసయోగ్యాలు కానప్పుడు ఆహారం దొరకకపోయినా, అక్కడి రాజులుగాని, ప్రభుత్వంగాని నిరంకుశంగా ఉన్న అక్కడ బతకడం కష్టమవుతుంది. ప్రాణాలకోసం మనిషి పోరాటం సాగించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, బతకాలన్న తీవ్రమైన కాంక్ష మనిషిని విజేతని చేస్తుంది. దక్షిణ వియాత్నంలోకి వలస వచ్చిన చైనీయుడు టింహా వాచీ రిపేర్ చేసుకుంటూ, ఇల్లు, ఆస్థి సంపాదించుకున్నాడు.ఇతనికి 4 అబ్బాయిలు, ఒక్కగానొక్క అమ్మాయి హ్యూ హ్యూ. వాచీలు బాగుచేస్తూ డబ్బులు కూడబెడుతూ బంగారు కణికలు కొని దాచేవాడు టింహా. బంగారం ఇస్తే వారిని రహస్యంగా ఆ దేశం నుంచి తప్పిస్తారని ఆశ. టింహా దగ్గర 2 సార్లు డబ్బులు తీసుకుని మోసం చేస్తారు. మూడవ సారి దేశమంతా పండగ హడావిడిలో ఉండగా ఓడలో ఆ దేశం నుంచి తప్పించుకుందాం అనుకుంటారు. కానీ ఎవరికి వారుగా విడిపోతారు. ఓడ లో హ్యూ, అతని అన్న ట్రాంగ్ ఒక 50 మందితో ప్రయాణం సాగించగా, ఆహరం లేక అందరు చనిపోగా సముద్రంలో చివరికి 8 మందితో హ్యూ ఇంకో ఓడ ఎక్కాలనుకుంటారు. కళేబరాల మధ్యన అస్థిపంజరంలా, తిండి లేక ఆ అమ్మాయి హ్యూ యొక్క పరిస్థితి ఏమిటో ? చివరికి ఆ అమ్మాయి తన తల్లి తండ్రులను కలుసుకుందా లేదా? ఇవన్నీ ఈ నవలావిశ్లేషణలో వినండి.
Image : https://i.pinimg.com/564x/fb/15/81/fb15815d8c3d40381851a105466d9dc4.jpg