ది ఇన్‌స్పెక్టర్
The Inspector
Malathi Chandur
ఎంతటి రాతి గుండె ఉన్న మనిషికైనా ఏదో ఒక సందర్భంలోనైనా కొన్ని సంఘటనలకి మనసు చలించకుండా ఉండదు. మన ప్రపంచ చరిత్రలో నాజీలు, యూదులపై చూపిన నిరంకుశత్వానికి ఉదాహరణ ఈ నవలా విశ్లేషణ. రెండవ ప్రపంచ యుద్ధానంతరం యూదులు ఎదుర్కున్న దయనీయ పరిస్థితులకు మానవాళి అందరం చలించి సిగ్గు పడక తప్పదు. నాజీల దురాగతాలకు బలైపోయిన ఒక యువతిని డచ్ దేశస్థుడైన ఒక ఇన్స్పెక్టర్ పీటర్ ఆ యువతి ఇష్ట ప్రకారం పాలస్తీనాకు పంపించే ప్రయత్నం గురించి, ఆ యువతి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయేలా నాజీలు ఆ యువతిపై చేసిన అత్యంత దారుణమైన, కిరాతకమైన పని గురించి ఈ నవలా విశ్లేషణలో వినండి.
...