ది ఎల్ షేపెడ్ రూమ్
The L Shaped Room
కొంతమందికి తమలో ఉన్న ప్రేమని వ్యక్తపరచడం రాదు. తండ్రికి కొడుకుపై అపారమైన ప్రేమ ఉన్న తాను దానిని ఆ కొడుకు ఎదురుగా చెప్పడు ఇందుకు ఉదాహరణగా మన పురాణాల్లో భారవి కథ చెబుతాడు. అతడు తండ్రిమీద కచ్చతో చంపాలనుకుంటాడు. ఇదేవిధంగా ఈ నవలలోని జేన్ తన తండ్రిపై ద్వేషంతో పెరుగుతుంది. బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం ఎలా ఉంటుందో అన్న ఆరాటంతో చేసిన పనికి గర్భవతి అవుతుంది. తన తండ్రివద్ద కాక ఒక మురికివాడలో ఒక ఇంట్లో అద్దెకు ఉంటుంది. ఆ ఇంట్లో, అక్కడ తనతో పాటు నివసించేవాళ్ళు ఆమెను ఎంతో ఆదరిస్తారు. వాళ్ళ మేనత్త దగ్గరకి వెళ్లి కొన్ని రోజులు ఉన్నాక, ఆమె చెప్పిన మాటల్లో వాళ్ళ నాన్న ప్రేమ గురించి తెలుస్తుంది. తాను ఒక బిడ్డకి జన్మనిచ్చాక తన తండ్రి ప్రేమను చూస్తుంది. వాళ్ళ మేనత్త జేన్ తండ్రి పై ప్రేమ కలిగేటట్టు ఏమిచెబుతుందో వినండి.
Image: https://posterspy.com/wp-content/uploads/2019/01/the-l-shaped-room-.jpg