ది పిజన్ ప్రాజెక్ట్
The Pigeon Project
Peter Townsend
సృష్టిలోని ప్రతీజీవి భయపడేది మృత్యువుకు అని ధర్మరాజు యక్షునికి సమాధానమిస్తాడు. మరణం లేకుండా ఇంకొన్నేళ్లు బ్రతకాలని ఎవరైనా మందు కనిబెడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పే నవల ఇది. సోవియెట్ యూనియన్‌లోని ఆఖభాజియాలో 150 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు 5000 మంది ఉన్నారు. మాక్ డోనాల్డ్ ప్రపంచ చరిత్రను మార్చే సిద్ధాంతాన్ని (ఫార్ములా) కనుగొన్నాడు. అతని సహాయకుడు లియోనార్డ్. రష్యా ప్రభుత్వం ఆ ఘనత తమకే చెందాలని ఆ సిద్ధాంతాన్ని బయటకు రానీయకుండా ఒక గూఢచారిని నియమిస్తారు. లియోనార్డ్‌కి ఆ విషయం తెలిసి, డోనాల్డ్‌ను తప్పించి పారిస్ సభకి పంపాలని చూడగా అతను మధ్యలో వెనిస్ లో అక్కడి ప్రభుత్వం వారిచే బంధించబడతాడు. డోనాల్డ్ అతనిని బంధించిన చోటకు వచ్చే పావురాలను మచ్చిక చేసుకుని, తనని తప్పించమని ఒక చీటిపై రాసి అది ఆ పావురాలకు కట్టి వాటిని వదులుతాడు. టిమ్ ఒక ఇంజినీర్. సర్వం పోగొట్టుకున్నఅతను 3 ఏళ్లుగా స్తబ్దుగా ఉంటూ డోనాల్డ్‌ను కాపాడే పనిలో పడతాడు. డోనాల్డ్‌ను కాపాడే ప్రయత్నంలో టిమ్ పడే కష్టాలు ఏమిటో, ప్రపంచానికి అతను ఆ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టగలిగాడా, ఇవన్నీ ఈ విశ్లేషణలో వినండి.
...