అమృతం కురిసిన రాత్రి - విశ్లేషణ
Amrutam Kurisina Raathri – Visleshana
C. Mrunalini
భావ కవులలో అభ్యుదయకవీ, అభ్యుదయ కవుల్లో భావకవీ, అన్నీ వర్గాల కవులు "మావాడు" అనుకొన్న కవి తిలక్ కథకుడు, నాటక కర్త కూడా. తన కవిత్వాన్ని సుతిమెత్తని వృత్త రీతిలో ప్రారంభించినా సమాజపు ఆధునిక పోకడలను అభివర్ణించడానికి ఆ పరిధి చాలదని గ్రహించి వచన గేయాన్ని అందుకున్నాడు. అది అతని చేతిలో అద్వితీయమైన అందాలను సంతరించుకుని అపురూప సౌందర్యంతో వెలుగొందింది. అదే ఆయనకు అఖండ కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టిన ‘అమృతం కురిసిన రాత్రి’. దాసుభాషితం యాప్ లో ఎక్కువగా వెతకబడిన శీర్షికలలో ఒకటైన ‘అమృతం కురిసిన రాత్రి’ పై డా.మృణాళిని గారి విశ్లేషణ ఇది.
Listen to a deep analysis of the famous book Amrutam Kurisina Raathri and of its writer Devarakonda Balagangadhar Tilak.