త్యాగరాజ ఆరాధనోత్సవాలు
Tyagaraja Aaradhanothsavalu
కర్ణాటక సంగీత సాంప్రదాయానికి పూజ్యుడు, తెలుగు వారి వాగ్గేయకారులలో అగ్రగణ్యుడు అయిన త్యాగయ్య గారి గురించి మృణాళిని గారి విశ్లేషణ విందాం. సాహిత్యానికి, నృత్యానికి ఉపాంగంగా సంగీతం మారిన కాలంలో దానికి సమగ్ర కళారూపం తెచ్చిన వారు త్యాగయ్య. వీరి కీర్తనలలోని సాహిత్యం అన్ని భాషల వారు అర్ధం చేసుకుని పాడుకునేలా చాలా సరళంగా ఉంటుంది. త్యాగయ్య కీర్తనలు కాక, యక్షగానాలు కూడా వ్రాశారు. నవవిధ భక్తి మార్గాలను వారి కీర్తనలలో చొప్పించిన విధానం, వాటిలో త్యాగయ్య అవలంభించిన భక్తి మార్గం గురించి, వారి కీర్తనలలో అలంకారాలు, యతి, ప్రాస వాడిన విధానం ఇంకా ... ఆరాధనోత్సవాలు ఎందుకు చేస్తారు? ఘనరాగా పంచరత్నకీర్తనల వివరణ గురించీ, వినండి మన దాసుభాషితం లో.
...