వాకాటి పాండురంగారావు - విశ్లేషణ
Vakati Pandurangarao - Visleshana
సుప్రసిద్ధ కథారచయిత, విమర్శకుడు, పత్రికా సంపాదకుడు, మహావక్త అయిన వాకాటి పాండురంగారావు గూర్చి విందాం. మేధ, సృజన రెండూ నిండుగా ఉండి, తెలుగు, ఇంగ్లీష్ భాషల మీద పూర్తి అవగాహన, పట్టు ఉన్న రచయితలలో ఈయన ఒకరు. మనిషి జీవితంలో సంపూర్ణ సత్యం ఎప్పుడు ఆవిష్కరింప బడుతుందో వివరించారు. తాను చదివిన దాన్ని, తెలుసుకున్న విజ్ఞానాన్ని చిన్న చిన్న కథల రూపంలో అందరికీ అర్ధమయ్యేలా చెప్పారు.వీరు స్వయంగా అనువాదకులు. వీరు పత్రికా సంపాదకుడుగా, వృత్తిరీత్యా అనేక ప్రదేశాలు చూశారు. వాటన్నిటిని కథల రూపంలో వివరించారు. వీరి కథలలో ప్రత్యేకత ఏంటి? వారి కథలలోని ప్రధాన అంశం ఏంటి? వీరి గురించి వివిధ రచయితలు ఏమన్నారు? ఇంకా వీరు రాసిన అపరాజిత, శివాన్విత గురించి విశ్లేషణలో వినండి.
...