వందే సినీ మాతరం 1
Vande Cine Mataram 1
Alok Nanda Prasad
ఉగాది పచ్చడిలో షడ్రుచులు లేకుండా, పప్పులో ఉప్పులేకుండా ఎలా ఉంటుందో అలాగే సినిమాలో కూడా నవరసాలు లేకుంటే అలానే ఉంటుంది.మన నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో నైనా సినిమా గురించి మాట్లాడకుండా ఉండలేము. గోంగూర పచ్చడి గురించి వచ్చినప్పుడల్లా అల్లూ రామలింగయ్య గారు గుర్తుకొస్తారు. మాయాబజార్ సిననిమాలో ఆయన దాన్ని గురించి చెప్పిన విధానానికి గోంగూర పచ్చడి తినని వాళ్ళ జీవితం వ్యర్ధం అనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో పాత్రలు, వారి నటన చూశాక ఇలాగే ఉంటారేమో (రాముడు, కృష్ణుడు, ఘటోత్ఘచుడు, దుర్యోధనుడు) అనుకుంటాం. అలా సినిమాలు మన ఊహాలకి ఒక రూపాన్ని తెచ్చాయి. అలాగే వంశీ సినిమాల్లో గోదారి దాని అందం, అర్జున్ సినిమాలో మీనాక్షీ గుడి...ఇలా ఒక సినిమా గురించి అందులోని పాత్రల గురించి మీకు వివరించేదే ఈ వందే సినీ మాతరం. వినండి ఆస్వాదించండి.
...