వింజమూరి తో ముఖాముఖీ
Vinjamuri – Mukhaamukhee
C. Mrunalini
"నేను నేర్చింది, నన్ను తీర్చింది శాస్త్రీయ సంగీతం, నన్ను వరించి వచ్చింది లలిత సంగీతం, నన్ను తరించింది జానపద సంగీతం" అని ఎప్పుడూ చెప్పిన 'తెలుగు జానపద గీత పితామహి' శ్రీమతి వింజమూరిని పూర్వం డా. మృణాళిని ఇంటర్వ్యూ చేసారు. ఆ ముఖాముఖిని మే 12 న వింజమూరి గారి పుట్టిన రోజు సందర్భంగా తిరిగి మీకు సమర్పిస్తున్నది దాసుభాషితం. ఈ ముఖాముఖీలో, బాల్యం నుంచే తనకి జానపదాల మీద కలిగిన ఆసక్తి గురించి, మేనమామ 'భావ కవి' శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారితో అనుబంధం గురించి, పొందిన విజయాలు, తెలుగు చిత్ర సీమలో జరిగిన అవమానాల గురించి, ఉత్సాహంగా నిర్మొహమాటంగా పంచుకున్నారు. మీరూ వినండి. విన్న తరువాత తెలుగు సమాజం ఆమెను సరిగ్గా గౌరవించుకోలేదేమో అనిపిస్తే, ఆ సందేహం సహేతుకమే.
Listen to a recording of interview with "Telugu Jaanapada Geetala Pitaamahi" Smt. Vinjamuri Anasuya. Interviewed by Dr. C. Mrunalini.