వాయిసెస్ ఆఫ్ సమ్మర్
Voices Of Summer
Dine Pearson
మనిషికి ఈర్ష్యా, ద్వేషాలు సహజము. కానీ అవి ఎదుటివారి ప్రాణం తీసే విధంగా ఉండరాదు. సంగీత కళాకారుల జీవితంలోని ఈ రాగద్వేషాల గురించి డైనే నవలలో విశ్లేషించారు. బశ్చర్ తన జీవితాన్ని సంగీతానికే అంకితం చేసి తన విశ్రాంత జీవనాన్ని ఒంటరిగా ఒక గ్రామంలో గడుపుతుంటాడు.ఆ ఊరి పెద్ద అయినా విల్లీకి సంగీతం అంటే చాల ఇష్టం. అతను తన కోరికను, ఒక సలహాను బశ్చర్‌కి వివరిస్తాడు. విల్లీ కోరిక మేరకు హొచాసర్ గ్రామాన్ని వియన్నా లాగా సంగీత నిలయంగా మారుస్తారు. గెస్నర్ అందమైనవాడు, మంచి గాయకుడు. అతనివల్ల, అతను తోటి కళాకారులతో ప్రవర్తించే తీరువల్ల విల్లీకి, బశ్చర్‌కి ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఏ గాయని అతనితో పని చేయడానికి ఒప్పుకోదు. 20 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న థెరసి ఒక్కతే గెస్నెర్ తో పని చేయడానికి ఒప్పుకుంటుంది. అయితే అతను థెరసి భర్త ఫ్రెడరిక్ చేసిన ఒక పనిని గుర్తుచేసి ఆమె కృంగిపోయేలా చేస్తాడు. విల్లీ చెప్పిన మాటలవల్ల థెరసి తరువాత రోజు కార్యక్రమంలో మంచి పేరు తెచ్చుకుంటుంది. ఫ్రెడరిక్ ఏం చేశాడు? థెరసి అజ్ణాతంలోకి ఎందుకు వెళ్లిపోయిందో వినండి.
...