వైన్ అండ్ ఆలివ్
Wine And Olive
Margaret Baning
ప్రభుత్వం అనేక చట్టాలు, పథకాలు రాజ్యాగంలో తీసుకువస్తుంది. అలా తీసుకువచ్చే పథకాల్లో మద్యనిషేధం, కుటుంబనియంత్రణ, హరితవిప్లవం ఇలాంటివి కొన్ని. కానీ అవి అమలు జరగాలంటే ఒక పెద్ద ఉద్యమం జరగాలి. అలాంటి ఉద్యమంలో ఒకటైన కుటుంబనియంత్రణ గూర్చి రచించబడినదే ఈ నవల. పిల్లల పౌష్ఠిక ఆహరం ఉత్పత్తులను తయారుచేసే బయోడ్ కంపెనీకి అధిపతి, సంపన్నుల్లో ఒకడు, అందగాడు అంగీస్. నలుగురి పిల్లల తల్లి అయినా ఎంతో అందంగా ఉండే చక్కటి మనిషి క్లారీ. వీరిద్దరూ ప్రేమించి వివాహం చేసుకుని అందరికి ఆదర్శవంతంగా ఉంటారు. క్లారి సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటూ, కుటుంబనియంత్రణకు ఉద్యమం చేబడుతుంది. ఈ ఉద్యమం వల్ల అంగీస్ కంపనీలో ఉత్పత్తుల కొనుగోలు పడిపోవడంతో ఇద్దరికీ మధ్య గొడవలు పెరిగి ఎవరి దారిన వారుగా అయిపోతారు. అంగీస్ కు తాను చేసిన పొరపాటేమిటో ఎలా తెలుస్తుందో వినండి ఈ విశ్లేషణలో...
...