వితౌట్ మెర్సీ
Without Mercy
Mirium Ali
లోకంలో వెల కట్టలేనిది, తరగనిది, ఏ స్వార్థం లేనిది అమ్మ ప్రేమ ఒక్కటే. జంతువులు, పక్షులు తన పిల్లలను కాపాడుకోడానికి ఎలా విశ్వప్రయత్నం చేస్తాయో అలాగే ఒక చదువులేని స్త్రీ తన పిల్లలను కాపాడుకోవడం కోసం చేసిన పోరాటాన్ని వివరించినదే "వితౌట్ మెర్సీ" అనే ఈ యదార్ధ గాథ. మిరియం అలీ బ్రిటన్ లో పని చేసుకుంటూ పొట్ట పోసుకునే ఒక యువతి. ఆమె పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన ఫ్రెడ్‌ను పెళ్లి చేసుకుంటుంది. ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చుని, కాలం వెళ్లబుచ్చే అతను పిల్లల్ని ఆదాయం తెచ్చే వనరుగా, భార్యను పిల్లల్ని కనే యంత్రంగా భావిస్తాడు. ప్రతి సంవత్సరం ఒక పిల్ల చొప్పున భార్య ఆరోగ్యాన్ని కూడా చూడకుండా ఐదుగురు పిల్లల్ని కంటాడు. ఆడ పిల్లల్ని ఇద్దర్ని వారి స్వస్థలమైన అరబ్ దేశంలోని యమన్‌ను చూపిస్తానని చెప్పి అక్కడ వారిని అమ్మేస్తాడు. దౌత్య కార్యాలయానికి లేఖలు రాసి, పత్రికల్లో తన దీన గాథను వివరించి, దుబాయిలో ఉన్న తన పిల్లల్ని, తన దగ్గరకు తెచ్చుకోడానికి మిరియం పడిన అగచాట్లు ఏమిటో వినండి.
Image : https://unsplash.com/photos/HNXi5znlb8U