#19 మదిలో వీణలు మ్రోగే…

Dasu Kiran
July 17, 2020

సాధారణంగా కవులలో ఒక పార్శ్వమే వారి రచనలలో కనబడుతుంది, లేదా ఒక పార్శ్వానికే వారు ఖ్యాతిని ఆర్జిస్తారు. ఉదాహరణకు ‘భావకవి’ దేవులపల్లి కృష్ణశాస్త్రి, ‘మనసుకవి’ ఆత్రేయ, కానీ దాశరథిలో ఎందరో కవులున్నారు. ఓ అభ్యుదయ కవి, ఓ విప్లవ కవి, ఓ సినిమా కవి ఇలా అందరు తమ ఉనికిని చాటారు, ప్రతిష్ఠులైనారు.

సాధారణంగా కవులలో ఒక పార్శ్వమే వారి రచనలలో కనబడుతుంది, లేదా ఒక పార్శ్వానికే వారు ఖ్యాతిని ఆర్జిస్తారు. ఉదాహరణకు ‘భావకవి’ దేవులపల్లి కృష్ణశాస్త్రి, ‘మనసుకవి’ ఆత్రేయ, కానీ దాశరథిలో ఎందరో కవులున్నారు. ఓ అభ్యుదయ కవి, ఓ విప్లవ కవి, ఓ సినిమా కవి ఇలా అందరు తమ ఉనికిని చాటారు, ప్రతిష్ఠులైనారు. 

దాశరథి రచనల్లో ఆశ్చర్యం కలిగించే విషయం, ఒకే ఉపమానాన్ని రెండు విరుద్ధ భావజాలాల ప్రకటనకు వాడడం. తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ లో వీణ ద్వారా వీర రసాన్ని ప్రకటిస్తే, మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే అనే పాటలో అదే వీణతో శృంగార రసాన్ని పలికించడం ఒక ఉదాహరణ. ఆయన ఎన్నో వీణ పాటలు రాయడంతో, సినీ వర్గాల్లో ఆయనకు ‘వీణ దాశరథి’ అనే పేరుండేదిట.

ఆడది మెచ్చినదే అందం అన్నట్టుగా, దాశరథి పాటవానికి నిదర్శనం, ఆచార్య ఆత్రేయ తాను నిర్మించిన వాగ్దానం సినిమాలో దాశరథి చేత నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా పాట రాయించుకోవడం. 

‘కవి సింహం’ దాశరథి కృష్ణమాచార్యులు జయంతి జులై 22న. ఆ సందర్భంగా ఆయన మానవీయత మీద, ఆయన విప్లవ రచనల మీద, మనసును హాయిగొలిపే ఆయన సినిమా పాటల మీద విశ్లేషణాత్మక కార్యక్రమాన్ని అందిస్తున్నది దాసుభాషితం.

విని ఆనందించండి.

చిన్న ప్రపంచం సిరివాడ 

Chinna Prapancham Sirivaada
Tap to listen


గేయ రచయితగా రచనా ప్రస్థానం ప్రారంభించి, తెలుగు కథ, నవలా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రముఖులలో ఒకరు శ్రీ మధురాంతకం రాజారాం గారు.

ఆధునిక తెలుగు నాగరీకానికి అద్దంపట్టే చిట్టి తెలుగు పట్టణం సిరివాడలో, పట్టపగటి వెలుగులో బాహాటంగానూ, రాత్రిపూట దీపాలార్పించేశాక చీకటి మాటునా నవ ధర్మదేవత పోతూన్న కొంగ్రొత్త పోకళ్లన్నీ వింగడిస్తూ, వ్యంగ్య హాస్య పరిహాసపు మసాలా పోపు వాసనలతో ఘుమళించే రాజారాం మార్కు నవల "చిన్న ప్రపంచం - సిరివాడ', శ్రీ మధురాంతకం రాజారాం గారి తనయుడు శ్రీ నరేంద్ర మధురాంతకం గారి సౌజన్యంతో తొలిసారి  శ్రవణ రూపంలో మీ ముందుకు వస్తున్నది.

కాశీ మజిలీ కథలు 9వ సంపుటం

Kaasi Majilee Kathalu Vol 9
Tap to listen


కాశీ యాత్రలో ప్రతి మజిలీలోనూ ఒక్కొక్క కథ చెప్పే నిబంధన మీద, గోపాలుడు అనే ఒక యువకుడిని వెంట తీసుకు వెళ్లిన మణిసిద్ధుడు, ఇచ్చిన మాట మేరకు అలాగే చిత్ర విచిత్రమైన కథలు చెపుతూ, సాగుతున్నాడు. తనను వెన్నంటి ఉంటూ  క్రమక్రమంగా బుద్ధిని వృద్ధి చేసుకుని తనతో పాటు సాగుతూన్న గోపాలునితో పాటు 170 మజిలీలు అధిగమిస్తాడు. ఈ తొమ్మిదవ భాగంలో 171 మజిలీ చేరుకున్న మణిసిద్ధుడు, దుందుభి కథ చెప్పటం ప్రారంభింస్తాడు.

Image Courtesy: Andhra Bhoomi, John Such

Image Courtesy :