దాసుభాషితం పని అయిపోయిందా? అనే సంశయం తో క్యాంపైన్ మొదలుపెట్టాము. 60 లక్షల రూపాయల లక్ష్యం చేరడానికి ఎంత సమయం పడుతుందో, అసలు ఎంత సమకూరుతుందో కూడా మాకు తెలియదు.
మీ అందరి సహయోగంతో ఇపుడు 4 నెలల్లోనే 80 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాము. దాసుభాషితం భవిష్యత్తుకు ప్రమాదం తప్పింది. ఇది ఖచ్చితంగా విజయమే. ఈ విషయం మీద 2 ని. వీడియోను పైన చూడవచ్చు.
ఇపుడు ఒక ఆశావహ దృక్పధంతో భవిష్యత్తును చూస్తున్నాము. ఒక వైపు కొత్త కాంటెంట్ విడుదల చేస్తూనే, కస్టమర్ సర్వీస్, న్యూస్లెటర్ విషయంలో మమ్మల్ని మేము మెరుగు పరచుకున్నాము. దాసుభాషితం ప్రసంగాలు వంటి కొన్ని కొత్త కార్యక్రమాలను కూడా ప్రారంభించాము. ముఖ్యంగా, ఆప్ పునర్ నిర్మాణం ప్రారంభమైంది. మరీ ముఖ్యంగా, దాసుభాషితం కూటమి అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా మీతో మరింత మమేకం అవుతున్నాము. ఇందులో జరిగే ఆసక్తికరమైన సంభాషణలు చూస్తుంటే మేము ఎంచుకున్న మార్గం ఎంత ఉత్తమమైనదో మాకు నిత్యం అవగతమవుతూ ఉంటుంది.మరి క్యాంపైన్ మాటేమిటి? 60 లక్షల లక్ష్యం చేరతామా? అసలు చేరాల్సిన అవసరం ఉందా?
అంటే… ఉంది. ఎందుకంటే…
టాక్సులు పోను, ప్రస్తుతం మాకొచ్చిన నిధులు బొటాబొటీ. లక్ష్యం చేరితే పరిస్థితి సౌకర్యంగా ఉంటుంది. ఇది కాదనలేని వాస్తవం. అయితే, క్యాంపైన్ కొనసాగించడానికి ఇదే కారణం కాదు. ముఖ్యంగా దాసుభాషితం ఫండ్ రైజ్ లో వంద శాతం సఫలీకృతమైతే, మంచి పనులను తెలుగు సమాజం ప్రోత్సహిస్తుందని, తెలుగు ఆధారిత సంస్థలకు అంతులేని ధైర్యం వస్తుంది. ఇది ఎంత శుభ పరిణామం! తెలుగు వ్యాపార సంస్థలకి ఒక మంచి కేస్ స్టడీ ఇచ్చేందుకు మనకున్న గొప్ప అవకాశం ఇది.
దాసుభాషితం సంస్థ నిలబడుతుందని నమ్మకం ఉండడం వల్ల, 60 లక్షల రూపాయల లక్ష్యం సాధించినా సాధించకపోయినా, ఈ క్యాంపైన్ ఎట్టి పరిస్థితులలో ఏప్రిల్ 4, 2023 తేదీ కల్లా సమాప్తమవుతుంది.
కాబట్టి ఆరు వేలు, టాక్స్ పదిహేను వందల యాభై కలుపుకుని, మొత్తం 7550 రూపాయలకే జీవిత సభ్యత్వం పొంది, తద్వారా దాసుభాషితం లో ఇప్పటికే వందల్లో ఉన్న శ్రవణ పుస్తకాలూ, విశ్లేషణలు, పాఠాలు కాక, మున్ముందు రాబోయే ఆడియో కాంటెంట్ అంతా కూడా, మరే అదన రుసుము లేకుండా వినే మహత్తర అవకాశం మరికొన్ని రోజులలో ముగుస్తుంది.
ఈ నాలుగు నెలల్లో మేము సాధించిన ఇంకొన్ని విజయాలు ఇవి.
#కూటమి
దాసుభాషితం కూటమి అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా, జీవిత చందా తీసుకున్న వాడుకరులతో ఎక్కువ మమేకం అవుతున్నాము. ఇది సాధారణ వాట్సాప్ గ్రూపులకి భిన్నం. ఎందుకంటే ఇది నియంత్రణ కలిగిన ఒక exclusive and curated గ్రూప్. ఇక్కడ జరిగే ఆసక్తికరమైన సంభాషణలు చూస్తుంటే మేము ఎంచుకున్న మార్గం ఎంత ఉత్తమమైనదో నిత్యం మాకు అవగతమవుతూ ఉంటుంది. మీరు జీవిత సభ్యత్వం తీసుకున్నట్లయితే, ఈ కూటమి లో చేరేందుకు మీరూ ఆహ్వానితులే. చేరడానికి మమ్మల్ని సంప్రదించండి.
#న్యూస్‌లెటర్
సాధారణంగా ఏ సంస్థకైనా #న్యూస్‌లెటర్ ఓపెన్ రేట్ సగటు 20 శాతం ఉంటే అది విజయవంతం అయినట్టు. అయితే దాసుభాషితం #న్యూస్‌లెటర్ ఓపెన్ రేట్ 30% పైనే.
వారం వారం పంపే దాసుభాషితం #న్యూస్‌లెటర్ కోసం ఎంతో మంది ఎదురుచూస్తారు.
అయితే, కొంతమందికి అవి అందడం లేదని తెలిసింది. ఇంతకు ముందు కూడా మాకు అందవలసిన కొన్ని ఈమెయిల్స్ అందలేదు. దాని వల్ల మేము స్పందించడం ఆలస్యమైంది. ఇందుకు కారణం మేము వినియోగిస్తున్న Software set up లో లోపాలు అని తెలిసింది. అవి సవరించుకుంటున్నాము. ఇక్కడ, యునైటెడ్ స్టేట్స్ మేరీల్యాండ్ నివాసి శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. న్యూస్ లెటర్ తనకు ఎందుకు రావడంలేదో మేము తెలుసుకుని పరిష్కరించేదాకా ఆయన మమ్మల్ని వదల్లేదు. పరుషంగా కూడా మాట్లాడారు.
కానీ ఆయన పట్టుదల వల్లే, set up లో ఉన్న లోపాలు మాకు తెలిసాయి, మేము వాటిని పరిష్కరించుకోగలిగాము. సర్, మీకు మరొక్కసారి ధన్యవాదాలు.
That said, ఈమెయిల్స్ ఎల్లప్పుడూ అందుతాయని గ్యారంటీ లేదు. అందుకే, ఈమెయిల్స్ కు అదనంగా న్యూస్ లెటర్ ను text రూపంలో దాసుభాషితం బ్లాగ్, తెలుగు Quora మన దాసుభాషితం వేదిక లలో, శ్రవణ రూపంలో దాసుభాషితం యాప్ లో, పాడ్కాస్ట్ సర్వీసెస్ లో ‘కథలు కబుర్లు’ గా అందిస్తున్నాము. YouTube, Instagram, Twitter, WhatsApp లలో ఈ లింక్స్ ను పంచుకుంటున్నాము.
#ప్రసంగాలు
క్యాంపైన్ మొదలైన తరువాత మేము ప్రారంభించిన ఇంకొక కార్యక్రమం ‘దాసుభాషితం ప్రసంగాలు’. డిసెంబర్ లో నిర్వహించిన LIVE Q&A, ఫిబ్రవరి లో జరిపిన కాపీరైట్ అవగాహన సెషన్స్ కు వచ్చిన ప్రోత్సాహంతో, ప్రతీ నెల మొదటి శనివారం లో వివిధ రంగాల్లో ఉన్న నిపుణులను పిలిచి, వారిచే ప్రసంగం ఇప్పించాలని నిర్ణయించుకున్నాము. మార్చ్ నెలలో ప్రముఖ గాయని శ్రీమతి మాడభూషి సౌజన్య గారు, తమ ప్రసంగం లో సినీ గీతాలను కళాత్మకంగా ఎలా ఆస్వాదించవచ్చో ఆమె మధుర గాత్రంతో ఎన్నో పాటలు పాడుతూ తెలియచేసారు. ఈ కార్యక్రమానికి కూడా విశేష స్పందన వచ్చింది.
ఈ కార్యక్రమాలు విజయం సాధించాలంటే కార్యక్రమం నియంత్రణతో సాగాలని మాకు తెలిసింది. అందుకే లైవ్ లో పాల్గొనే అవకాశాన్ని కూటమి సభ్యులకి మాత్రమే పరిమితం చేశాము.
మేము లైన్ అప్ చేసిన నిపుణులను మీకు పరిచయం చేసేందుకు ఎంత ఉత్సాహపడుతున్నామంటే, ప్రతి నెలా మొదటి శనివారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేటంత.
#యాప్
ఇక ముఖ్యమైన యాప్ విషయంలో, ఒక శుభవార్త. యాప్ Backend పునర్నిర్మాణంలో చెప్పుకోదగ్గ పురోగతి సాధించాము. ఇపుడు Frontend పై కూడా పని మొదలయ్యింది. మొదట వాట్సాప్ దాసుభాషితం కూటమి లో ఉన్న సభ్యులకు, తర్వాత ఇతర జీవితకాల సభ్యులకు, ఆ పైన అందరికీ విడతల వారీగా కొత్త యాప్ విడుదల చేస్తాము. యాప్ పూర్తిగా విడుదల అవడానికి కొన్ని నెలలు పట్టవచ్చు.
#క్యాంపైన్
పైన వీడియోలో చెప్పినట్టు, దాసుభాషితం సంస్థ నిలబడుతుందని నమ్మకం ఉండడం వల్ల, 60 లక్షల రూపాయల లక్ష్యం సాధించినా సాధించకపోయినా, ఈ క్యాంపైన్ ఎట్టి పరిస్థితులలో ఈ తేదీ కల్లా సమాప్తమవుతుంది.
ఏప్రిల్ 4, 2023 మంగళవారం.
కాబట్టి 6000 రూపాయలు, టాక్స్ 1550 కలుపుకుని, మొత్తం 7550 రూపాయలకే జీవిత సభ్యత్వం పొంది తద్వారా దాసుభాషితం లో ఇప్పటికే వందల్లో ఉన్న శ్రవణ పుస్తకాలూ, విశ్లేషణలు, పాఠాలు కాక, మున్ముందు రాబోయే ఆడియో కాంటెంట్ అంతా కూడా మరే అదన రుసుము లేకుండా వినే మహత్తర అవకాశం మరికొన్ని రోజులలో ముగుస్తుంది.
మీరో, మీ స్నేహితులో ఇప్పటి వరకు తీసుకోకపొతే, జీవిత చందా తీసుకునేందుకు ఇదే అంతిమ అవకాశం. దాసుభాషితం ఈ ధర మరెప్పుడు ఆఫర్ చేయదు. డబ్బు చెల్లించే వివరాలు క్రింద ఉన్నాయి.
ధన్యవాదాలు.
అభినందనలతో,
దాసుకిరణ్
Make direct payment to Dāsubhāshitam
via Google Pay, UPI, and Wire Transfer.
Take multiple Lifetime Subscriptions and gift it to others.
Please note 18% GST and 3% Commission will be added to the amount.
Cost to you: ₹7550 ($99)
What we get:
₹7550
- 227 (3% +₹3 Tran. Fee)
- 1319 (18% GST)
= ₹ 6001
Payment Options
Google Pay
Send money to 99520 29498.
Or use this QR code.
UPI
Use this ID for PayTM, PhonePe etc. – 9952029498@okbizaxis
You'll see Dasubhashitam and Cimarron Lifecare Services in the details.
Credit Card / Debit Card
From India – Use this Instamojo link – https://imjo.in/phzbZb
Outside India – Use Paypal – https://www.paypal.me/dasubhashitam
Please transfer $99 (after fees and taxes we get ~₹6000)
Direct Bank Transfer
Company: Cimarron Lifecare Services Pvt. Ltd.Bank: Yes BankAC No: 002281300002296Branch: Prestige Obelisk, Kasturba Road, BangaloreIFSC: YESB0000022SWIFT CODE: YESBINBB